CBN FIRES ON CM JAGAN : "ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ" పేరుతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఆక్వారంగం ప్రధానంగా ఉన్న 6జిల్లాల రైతులు, రైతు సంఘం నాయకులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆక్వా రంగంలో రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా మారుస్తామని తెలిపారు.
ఆక్వారంగానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న చంద్రబాబు.. సీఎం జగన్ ధనదాహానికి రైతులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే వ్యవసాయ అనుబంధ పథకాలను సైతం పక్కనపడేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్వా రంగంలో జోన్, నాన్ జోన్ విధానాలకు స్వస్తి పలికి అందరికీ రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆక్వా రైతులను గుప్పెట్లో పెట్టుకునేందుకే కొత్త చట్టాలు తెచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఫీడ్ ఉత్పత్తిదారుల నుంచి ఏడాదికి 500 కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.. అంతకుముందు మాట్లాడిన ఆక్వా రైతులు.. సర్కారు విధానాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు.
పులివెందులలో కూడా వైసీపీ గెలవలేదు: తన కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలైయ్యాయని చంద్రబాబు అన్నారు. 8 జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను వైసీపీ మార్చేసిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు వచ్చే సీట్లు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. పులివెందులలో కూడా వైసీపీ గెలవలేదని జోస్యం చెప్పారు. ప్రభుత్వ ధనదాహానికి ఆక్వా రైతులు బలైపోతున్నారని మండిపడ్డారు. ఎదురుదాడితో రైతు సమస్యలు పరిష్కారం కావనే విషయాన్ని జగన్ గ్రహించాలని సూచించారు. సమస్యల పరిష్కారం చేతకాకుంటే రాజీనామా చేయమని సూచించారు. తాను వచ్చి సమస్యలు ఎలా పరిష్కరించాలో చూపిస్తానని సూచించారు. జోన్ విధానం తీసుకొచ్చి రైతుల పొట్టెందుకు సూచించారు.
ఇవీ చదవండి: