పండుగ వేళ భవన నిర్మాణ కార్మికులు బ్రహ్మాజీ, వెంకట్రావు ఆత్మహత్య ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరతతో పనుల్లేక కార్మికులు బలవన్మరణానికి పాల్పడడం ఆవేదనకు గురిచేస్తోందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం మాత్రం తమ పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఏదైనా పోరాడి సాధించాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు. ఇంకెవరూ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రబాబు హితవు పలికారు. ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందని, వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడదామని, ఇసుక అక్రమాలపై నిలదీద్దామని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి: