ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేసిందని నరసరావుపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి డాక్టర్. చదలవాడ అరవింద్‌బాబు అన్నారు. చంద్రబాబు మహిళలకు అండగా నిలిచి ఎన్నో ఫలాలను అందించారని గుర్తుచేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారన్న అరవింద్‌బాబు... ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఓడినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ... సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజలందరూ సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత వివాదాలు సృష్టించేవారు బయటకు రావాలని కోరారు. వీరి వల్ల పార్టీకి ఎంతో నష్టం వాటిల్లిందన్నారు.
ఇదీ చదవండీ...