ETV Bharat / state

నివర్ ఎఫెక్ట్: నష్టపోయిన పంటలను పరిశీలించిన కేంద్ర కమిటీ బృందం - గుంటూరు జిల్లా వార్తలు

నివర్ తుపాను నష్టపోయిన పంటలను.. ముగ్గురు సభ్యులతో ఏర్పడిన కేంద్ర కమిటీ బృందం శుక్రవారం గుంటూరులో పరిశీలించింది. జిల్లాలోని పొన్నూరు, చేబ్రోలులో నేలవాలిన పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. తుపాను కారణంగా పూర్తిగా నష్టపోయామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు అధికారులను కోరారు.

central team visits cyclone affected crops in guntur district
నివర్ కారణంగా నేలవాలిన పంటలను పరిశీలించిన కేంద్ర కమిటీ బృందం
author img

By

Published : Dec 18, 2020, 4:16 PM IST

గుంటూరు జిల్లాలో నివర్ తుఫాన్ కారణంగా ఏర్పడిన పంటనష్టాన్ని ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర కమిటీ బృందం పరిశీలించింది. పొన్నూరు మండలం, చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో నేల వాలిన వరిపంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎకరాకు రూ.30వేలు కౌలు చెల్లించి.. సేద్యం చేసేందుకు మరో రూ.25 వేలు ఖర్చు చేశామన్నారు. వారం రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో ఏర్పడిన తుపాను కారణంగా.. పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోయారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: పొన్నూరు ఎమ్మెల్యే

నివర్ తుపాను ధాటికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పొన్నూరు మండలం మునిపల్లి గ్రామంలో నేల రాలిన పంటలను కేంద్ర బృందానికి చూపించారు.

రైతులకు న్యాయం జరగాలి: ధూలిపాళ్ల నరేంద్ర

కేంద్ర బృందం వెల్లలూరులో ఆగకుండా వెళ్లిపోతుండటంతో.. వారిని అడ్డగించి పంటలను పరిశీలించాలని కోరారు. అధికారులు వెల్లలూరులో నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులకు న్యాయం జరగాలని.. కేంద్ర బృందానికి మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర వినతిపత్రం అందించారు.

ఇదీ చదవండి:

'పెన్నా ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారమివ్వాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.