ETV Bharat / state

ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి: అథవాలే - undefined

పేదలకు భూముల పంపిణీ, ఎస్సీలకు రిజర్వేషన్ల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాను రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి విస్తరిస్తామని వెల్లడించారు.

కేంద్రమంత్రి
author img

By

Published : Aug 11, 2019, 11:23 PM IST

కేంద్రమంత్రి పర్యటన

రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18 శాతముంటే... 15 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయని దీనిని పెంచాల్సిన అవసరముందని కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి హ్యాపీ రిసార్టులో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) రాష్ట్రస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన అథవాలే... జనాభా ఆధారంగా ఎస్సీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కువ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని.. దానిని పేదలకు పంచిపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాందాస్ కోరారు. ఆర్పీఐ భవిష్యత్తులో రాష్ట్రంలో కీలకపాత్ర పోషించనుందని.. పార్టీని ప్రతి గ్రామంలో విస్తరింపజేస్తామని చెప్పారు. ఆర్పీఐ ఏ ఒక్క కులానికో పరిమితం కాదన్నారు. కశ్మీర్​లో 370 ఆర్టికల్ రద్దు చరిత్రాత్మకమని.. కశ్మీర్​పై కేంద్రం తాజా నిర్ణయం ఆ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని అథవాలే అభిప్రాయపడ్డారు. కశ్మీర్ కోసం పాకిస్థాన్ ఏమార్గంలో వచ్చినా ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని అథవాలే పేర్కొన్నారు.

Intro:చిత్తూరు జిల్లా మదనపల్లిలో సెల్ టవర్ ఎక్కిన యువకుడు

Body:రెండు గంటలు తీవ్ర ఉత్కంఠ

Conclusion:సినిమా హీరో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన కొబ్బరి మట్ట సినిమాను మదనపల్లిలో విడుదల చేయలేదని రెడ్డప్ప అభిమాని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపా డు ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది పట్టణంలోని బాబు కాలనీకి చెందిన మెకానిక్ రెడ్డప్ప ఆదివారం బైపాస్ రోడ్ లోని సెల్ టవర్ ఎక్కి కేకలు వేశాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సెల్ టవర్ నుంచి కిందకు దిగడానికి ప్రయత్నిం చారు వరుసకు సోదరు డైన ఒక వ్యక్తి ఇ సెల్ టవర్ పైకి అతని కిందికి వచ్చాడు పోలీసు లు లు రెడ్డప్ప ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు సుమారు రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో లో ఉత్కంఠ నెలకొంది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.