ETV Bharat / state

మృతదేహం ఇవ్వడానికి డబ్బులు డిమాండ్.. ప్రైవేట్ ఆస్పత్రిపై కేసు నమోదు - నరసరావుపేటలో కరోనా మృతదేహం ఇవ్వడానికి డబ్బులు డిమాండ్

కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని బంధువులకు అప్పగించడానికి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం డబ్బులు డిమాండ్ చేసింది. ఈ విషయమై బాధితుల సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. ఆ ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది.

fir file on private hfir file on private hospitalospital
fir file on private hospital
author img

By

Published : May 18, 2021, 10:57 PM IST

కొవిడ్​తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని బంధువులకు అప్పగించడానికి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో గుంటూరు జిల్లా నరసరావుపేటలోని లైఫ్ లైన్ ఆస్పత్రిపై కేసు నమోదైంది. బంధువుల సమాచారంతో విజిలెన్స్ అధికారులు రెండో పట్టణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

రూ. 4.60 లక్షలు వసూలు.. 2 లక్షలు డిమాండ్!
ఆ వ్యక్తి కొంత కాలంగా ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లులో లారీ డ్రైవర్ పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. 15 రోజుల క్రితం దేవరాజుకు కరోనా సోకడంతో నరసరావుపేట పట్టణంలోని లైఫ్ లైన్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇప్పటి వరకూ సుమారు 4లక్షల 60 వేల రూపాయలు వైద్యశాలలో చెల్లించినట్లు బంధువులు చెబుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున దేవరాజు మృతి చెందాడని .. 2 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని వైద్యులు తెలిపారన్నారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు వైద్యశాలకు చేరుకుని యాజమాన్యంతో మాట్లాడి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.

విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: జంట హత్యల కేసులో నిందితులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.