ఈనెల 28న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాజధాని ప్రాంత పర్యటనపై కొందరు స్థానిక రైతులు నిరసన వ్యక్తంచేశారు. తన పర్యటన కంటే ముందు రాజధాని రైతులకు గతంలో ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా తాము పూర్తిగా నష్టపోయామని ధ్వజమెత్తారు. రహదారులు, మౌలిక సదుపాయలు పూర్తిచేసి ప్లాట్లు ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటికీ ఆ పని పూర్తిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి