ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రాజధాని రైతులు 97వ రోజు ధర్నా చేస్తున్నారు. తాడికొండ అడ్డరోడ్డు శిబిరం రైతులు ... వారి గ్రామమైన పొన్నెకల్లులో ఇళ్లనుంచే నిరసన దీక్షలు చేపట్టారు. మూడు రాజధానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. సీఎం జగన్ తన మనసు మార్చుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా రాజధాని అమరావతిని సాధించుకునే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు.
ఇదీచూడండి. కరోనా ఎఫెక్ట్: దీక్షాశిబిరంలో ఆ వయసు వాళ్లు మాత్రమే ఉండాలట!