ETV Bharat / state

దగ్గర పడుతున్న గడువు.. ఊపందుకున్న ప్రచార జోరు - mlc elections in andhra pradesh

MLC Election Campaign: రాష్ట్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్‌ అక్రమాలకు అంతం పలికేందుకే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పోరాటం చేస్తున్నాయని.. నేతలు అంటున్నారు. ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాలతో పాటు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

MLC Election Campaign
ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 11, 2023, 10:14 AM IST

రాష్ట్రంలో తారస్థాయికి చేరిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార జోరు

MLC Election Campaign: ఎమ్మెల్సీ ఎన్నికల గడువు దగ్గర పడటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. రాజకీయ పార్టీల జోక్యం లేకుండా స్వేచ్ఛగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉండగా... అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ ఎస్ ప్రసాద్ శ్రీకాకుళంలో ఆరోపించారు.

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి.. సీఎం జగన్‌ ఓటమి భయంతోనే పట్టభద్రుల ఎన్నికల్లో దొంగ ఓట్లు చేర్పించారని విమర్శించారు. పట్టభద్రుల భవిత.. తెలుగుదేశం బాధ్యత అన్న నినాదంతో అనకాపల్లిలోని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు సైకిల్‌పై ప్రచారం చేశారు. విధ్వంసక పాలకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలుగుదేశం నేత కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు, రిగ్గింగ్ తదితర అంశాలపై శ్రేణులు జాగ్రత్తగా ఉండాలని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సూచించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు చేర్చినా ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించడం లేదని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డిని గెలిపించి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అనంతపురంలో పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్నిమళ్లీ మోసం చేసేందుకు సీఎం జగన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మంత్రులు అక్రమాలకు తెరలేపే విధంగా వ్యవహరిస్తున్నారని పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ, సీపీఐ కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. శాసన మండలి రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.

"ఎన్నికల సంఘానికి అనేక సార్లు ఫిర్యాదులు ఇచ్చినా.. కోర్టు ద్వారా ఆ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చినా.. ఇప్పటికీ అర్హులు కాని ఓటర్లను కొనసాగిస్తోంది. రెండో వైపు.. కొంతమంది డబ్బులు పంచి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని మేము భావిస్తున్నాము". - కేఎస్ఎస్ ప్రసాద్​, టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

"కేవలం ఉద్యోగుల ఓట్ల కోసం మాత్రమే.. నిన్న కాక మొన్న చర్చలకు పిలిచి ఉగాది రోజుకి 3 వేల కోట్లు ఇస్తామని మళ్లీ మాయ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నాను ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా.. నిజంగా మీపై ప్రేమ ఉంటే ఉగాది వరకూ ఎందుకు.. రేపో, ఎల్లుండో మీ బకాయిలు ఇమ్మని అనండి. అందుకే ఈ ప్రభుత్వ మోసంలో పడొద్దని చెప్తున్నాను". - అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.