గుంటూరు జిల్లా అద్దంకి బ్రాంచ్ కెనాల్ కు అకస్మాత్తుగా నీటి సరఫరాను తగ్గించడంతో రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. పంట పొలాలకు 800 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్న అధికార్లు, ఎలాంటి సమాచారం లేకుండా నీటి సరఫరాను 400 క్యూసెక్కులకు తగ్గిచడంతో ఎన్ ఎస్ పీ అధికారులను రైతులు నిర్భందించారు. నకరికల్లు మండలం చేజర్ల, కుంకలగుంట గ్రామాలకు చెందిన రైతులు అధికార్ల ముందు ఆందోళనకు దిగారు. సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నా నీటి సరఫరా ఎందుకు అందించడం లేదని మండిపడ్డారు. ఉన్నతాధికార్లతో మాట్లాడి తదుపరి నీటి సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇదీచూడండి.జగన్ పిటిషన్పై విచారణ వాయిదా