Cabinet Sub Committee on Bhu Hakku Bhu Raksha Scheme: రాష్ట్రంలో భూహక్కు-భూరక్ష పథకం మూడో దశను 2024 జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. సచివాలయంలో భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు బొత్స, ధర్మాన, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర సర్వేపై మంత్రుల కమిటీ సమీక్షించింది. ఇప్పటి వరకు రెండు దశల్లో సర్వే పూర్తి చేశామని మంత్రులు తెలిపారు. మొదటి, రెండో దశల్లో మొత్తం నాలుగు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, భూహక్కు పత్రాలను పంపిణీ చేసినట్టు తెలిపారు. మూడో దశ సర్వేను వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు పనిచేయాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల 72 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 9 వేల గ్రామాలకు డ్రోన్ ఇమేజ్లను కూడా పంపించినట్టు వెల్లడించారు. మూడో దశకు సంబంధించి ఇప్పటికే 360 గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 పట్టణ ప్రాంత స్థానిక సంస్థల పరిధిలో 15.02 లక్షల ఎకరాలను సర్వే చేయాల్సి ఉందన్నారు. మూడో దశ నాటికి నాలుగు యూఎల్బీల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, హక్కు పత్రాలను అందించాలనే లక్ష్యం మేరకు పని చేయాలని ఆదేశించారు.
Jagananna Bhu Hakku Bhu Raksha Survey Granite Stones: అదే విధంగా భూహక్కు-భూరక్ష సర్వే కోసం వినియోగించే గ్రానైట్ రాళ్ల గురించి మంత్రి పెద్దిరెడ్డి కొద్ది రోజుల క్రితం కీలక విషయాలు తెలిపారు. ఇప్పటివరకూ సర్వేరాళ్ల కొనుగోళ్ల కోసం 1153.2 కోట్లను సరఫరాదారులకు చెల్లించినట్లు తెలిపారు. మొదటి దశలో 25.80 లక్షలు, రెండో దశలో 26.15 లక్షలు సర్వేరాళ్లు సరఫరా జరిగిందన్నారు.
CM REVIEW: సమగ్ర సర్వేతో.. భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయి: సీఎం జగన్
Sub Committee on Aqua Prices: సచివాలయంలో ఆక్వా సాధికారిత మంత్రుల అధికారుల కమిటీ సమావేశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 46,433 ఆక్వా విద్యుత్ కనెక్షన్ లకు విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నట్టు మంత్రుల కమిటీ వెల్లడించింది. వచ్చే నెలలో అదనంగా మరో 4230 కనెక్షన్ లకు విద్యుత్ సబ్సిడీ మంజూరు చేసినట్టు తెలిపింది. 100 కౌంట్ రొయ్యలకు కేజీ 240 గా ధర ఖరారు చేసింది. సాధికారిత కమిటీ ఏర్పాటు తరువాత 6 సార్లు ఆక్వా ఫీడ్, సీడ్ ధరల పై సమీక్ష నిర్వహించారు. స్థానిక మార్కెట్ లో ప్రతినెలా 1000 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరుగుతున్నట్టు కమిటీ స్పష్టం చేసింది.