ETV Bharat / state

సాదాసీదాగా వేడుకలు... కొనుగోలుదారులు లేక వ్యాపారుల అవస్థలు - గుంటూరు నేటి వార్తలు

కొత్త ఏడాది వస్తుందంటే చాలు... కేకులు, మిఠాయిలు, బహుమతులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా భయం, ప్రజల ఆర్థిక ఇబ్బందులు... వెరసి వ్యాపారం నెమ్మదించింది. తయారు చేసిన ఉత్పత్తులు అయిపోతాయో, లేదోనని వ్యాపారులలో ఆందోళన పెరిగింది. కొత్త ఏడాదైలో కరోనా కష్టాలు వీడి.. తమ జీవితాల్లో ఆనందాలు నింపాలని వ్యాపారులు కోరుతున్నారు.

Business booming due to corona in guntur
గుంటూరులో కొనుగోలుదారులు లేక వ్యాపారుల అవస్థలు
author img

By

Published : Dec 31, 2020, 10:36 PM IST

కరోనా కారణంగా 9నెలలుగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. అన్​లాక్ తర్వాత వ్యాపారాలు మొదలైనా మునుపటి జోరు కనిపించటం లేదు. కరోనా వ్యాప్తి, కరోనా స్ట్రెయిన్ దీనికి కారణంగానే కనిపిస్తోంది. గుంటూరు నగరంలోని బేకరీలు, మిఠాయి దుకాణాలు కొనుగోలుదారులు లేక కళతప్పింది. కరోనా కారణంగా ఆంక్షల మధ్య కొత్త ఏడాది వేడుకలు సాదాసీదాగా జరుపుకుంటున్నట్లు ప్రజలు తెలిపారు. హ్యాపీ న్యూ ఇయర్ లో హ్యాపీ మాయమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూలబొకేలు, ఇతర బహుమతులు విక్రయించే వారి పరిస్థితీ ఇలాగే ఉందని వాపోతున్నారు.

ఇదీచదవండి.

సమయస్ఫూర్తితో.. మృత్యువుని ఆపి బాలుడిని కాపాడారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.