గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఎద్దులు బెదిరిపోయి..నిమజ్జనంలో పాల్గొన్న భక్తులపైకి దూసుకెళ్లాయి. ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏం జరిగిందంటే..
కొత్తపల్లికి చెదిన ఓ కాలనీ వారు డీజే శబ్దాలతో వినాయకుడి ఊరేగింపు చేస్తున్నారు. కాగా..డీజేకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. గత రెండు రోజులుగా నిమజ్జనంలో డీజేకు అనుమతి ఇచ్చి..ఇప్పుడు తమను ఎలా అడ్డుకుంటారని పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. తమకు పర్మిషన్ ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ శబ్దాలకు అటుగా వెళ్తున్న ఎద్దులు ఒక్కసారిగా బెదిరిపోయి..ఆందోళన చేపట్టిన భక్తులపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో రామ్శెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు అతడిని నరసాపురంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి