ETV Bharat / state

పార్లమెంట్‌లో హిండెన్​బర్గ్​ నివేదిక రగడ .. మరోసారి బీఆర్ఎస్ వాయిదా తీర్మానం - telangana in parliament

adani issue in parliament : పార్లమెంటు ఉభయ సభల్లో అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనివల్ల గత వారంలో రెండుసార్లు ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. తాజాగా ఈ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ , డీఎంకే పార్టీలు ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చారు.

adani issue in parliament
adani issue in parliament
author img

By

Published : Feb 6, 2023, 12:00 PM IST

adani issue in parliament : పార్లమెంటులో అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక అంశంపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉభయసభల్లో ఈ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కాస్తా పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. దాంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

ఈ క్రమంలో ఉభయసభల్లో అదానీ-హిండెన్‌బర్గ్‌ రిపోర్టుపై చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇండియన్ వర్క్ నివేదిక ఆధారంగా సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. ఈ అంశం పైనే మరికాసేపట్లో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్షాలు భేటీ కానున్నాయి. ఉదయం నుంచి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించాయి. తదుపరి కార్యాచరణను ఈరోజు చర్చించి ఖరారు చేయనున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్‌తో పాటు డీఎంకే పార్టీ కూడా ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చాయి.

ఇవీ చదవండి :

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.