వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించిందని.. బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీఛైర్మన్ వేమూరి ఆనంద్‌సూర్య ఆరోపించారు. నరసరావుపేటలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన బ్రాహ్మణ సంఘం సభ్యుల నిరసన దీక్షలో ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గత తెదేపా ప్రభుత్వం హయాంలో అనేక సంక్షేమ పథకాలను అందించిందని గుర్తుచేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రాహ్మణ కార్పోరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్నారు. తెదేపా హయాంలో అమరావతిలో నూతన దేవాలయం కోసం 25 ఎకరాలు కేటాయించారని.. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని 5 ఎకరాలకు కుదించడం దారుణమని చెప్పారు. అమరావతిలో తితిదే ఆలయ నిర్మాణానికి బ్రాహ్మణ కార్పోరేషన్ సభ్యులు పోరాడాలని ఆనంద్‌సూర్య కోరారు.
ఇదీ చదవండి: