తెలంగాణలో అనుమతి పొంది, ఆంధ్రాలో ప్రయాణికులను ఎక్కించుకుంటున్న బల్లకట్టులపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణాధికారి చైతన్య ఆయా శాఖల అధికారులకు చెప్పారు. 3 రోజుల కిందట అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. గత నెల 18న ‘ఈనాడు’ జిల్లా పేజీలో ‘బరి తెగింపు’.. శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో సీఈవో స్పందించారు. గోవిందాపురం, పుట్లగూడెం, మాదిపాడు రేవులలో బల్లకట్లు తిప్పుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే, వారు ఆంధ్రాలో ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని రేవుల్లో బల్లకట్లు తిప్పేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంపై.. వేలం నిర్వహించలేదని గుర్తు చేశారు. దీన్ని అవకాశంగా తీసుకొని తెలంగాణ బల్లకట్టు నిర్వాహకులు జిల్లాలోని రేవుల్లో ఆంధ్రా ప్రజలను ఎక్కించుకుంటున్నారని, నిబంధనలు ప్రకారం బల్లలు ఖాళీగా వెళ్లాల్సి ఉన్నా అలా చేయడం లేదని చెప్పారు. వెంటనే చర్యలు తీసుకోవాలని మాచవరం, అచ్చంపేట తహశీల్దార్లు, గుంటూరు గ్రామీణ ఎస్పీ, విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్, గురజాల డీఎస్పీ, మాచవరం ఎంపీడీవోకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: