రైతు భరోసా మొత్తాన్ని 18 వేలకు చేర్చాలని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భాజపీ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ నారాయణ్. కేంద్రం ఇచ్చే 6 వేలకు అదనంగా 12 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే కలపాలన్నారు. ప్రభుత్వం నేడు విడుదల చేసిన పీఎం కిసాన్ ప్రకటనలో ప్రధాని బొమ్మను ముద్రించకపోవడాన్డాని తప్పుబట్టారు.
ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో రైతులకు రూ. 12 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చి... కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ. 6 వేలతో కలిపి రూ. 12 వేలు తానే ఇస్తున్నట్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన అన్నారు. అంతే కాకుండా రాష్ట్రం నుంచి రూ. 1500 పెంచి మొత్తం రూ. 13,300 రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమం ప్రచార ప్రకటనల్లో ప్రధాని బొమ్మను కూడా తీసేయటం రాష్ట్ర ప్రజలను మోసం చేయటమే అని ఆగ్రహించారు. పీఎం కిసాన్- రైతుల భరోసా పథకంలో.. కేంద్రం వాటా 45 శాతంపైగా ఉన్నదన్న సంగతి ముఖ్యమంత్రి గమనించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: