ETV Bharat / state

దేశంలో సమస్యలు కనపడట్లేదా?: యనమల

వ్యవసాయం సంక్షోభంలో, మధ్యతరగతి ప్రజల జీవనం దీనస్థితిలోనూ ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ అన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా వాటిని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ఇది ఓట్​ ఆన్ అకౌంట్ బడ్జెట్​లా లేదని ఎన్నికల బడ్జెట్​లా ఉందని అభిప్రాయపడ్డారు.

యనమల రామకృష్ణ
author img

By

Published : Feb 1, 2019, 9:53 PM IST

రాష్ట్ర విభజన సమస్యలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై కేంద్ర బడ్జెట్​లో ప్రస్తావించకపోవడం దారుణమని మంత్రి యనమల అన్నారు. రాజ్యాంగ బద్దంగా రాష్ట్రానికి వచ్చే నిధులు ఎలాగో వస్తాయి. కానీ కేంద్ర విచక్షణ మేరకు ఖర్చుచేసే నిధులు భాజపాయేతర రాష్ట్రాలకే ఇస్తున్నారని విమర్శించారు. కౌలుదారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఆదాయ పన్ను పరిమితిని పెంచడం మధ్య తరగతికి కొంత ఊరటనిచ్చే అంశమే అని పేర్కొన్నారు. ఇది ఓట్​ ఆన్ అకౌంట్ బడ్జెట్​లా లేదని ఎన్నికల బడ్జెట్​ ప్రవేశపెట్టినట్టు ఉందని అభిప్రాయపడ్డారు.నిరుద్యోగ రేటు తగ్గించడానికి బడ్జెట్​లో ఏవిధమైన నిర్ణయాలు తీసుకోలేదన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయం వృద్ధి రేటు చాలా తక్కువగా ఉందని వెల్లడించారు.

New Delhi, Feb 01 (ANI): The president of Federation of Indian Chambers of Commerce and Industry (FICCI) Sandip Somany hailed the introduction of Pradhan Mantri Shram Yogi Mandhan Pension scheme for senior citizens in unorganized sector and termed it as an excellent scheme as it will benefit large number of population.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.