ETV Bharat / state

'ప్రభుత్వం ఆస్తులు కాపాడాలి.. అమ్ముకోకూడదు'

భూముల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని భాజపా రాష్ట్ర లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ జూపూడి రంగరాజు డిమాండ్ చేశారు. విలువైన భూములు అమ్ముకుంటూ పోతే... రాష్ట్ర భవిష్యత్​ ప్రశ్నార్ధకమవుతుందన్నారు.

bjp leaders State Legal Cell Convener jupudi rangaraju
ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం కాపాడాలన్న భాజాపా నేతలు
author img

By

Published : May 17, 2020, 12:16 PM IST

బిల్డ్ ఏపీ కోసం ప్రభుత్వ భూములను అమ్మడం సరైన పద్ధతి కాదని భాజపా రాష్ట్ర లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ జూపూడి రంగరాజు అన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే నిలిపివేసి, వాటిని భావితరాలకు అందించాలని కోరారు. గుంటూరు నడి బొడ్డున ఉన్న మార్కెట్​ను అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు.

ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే... ఇలా భూములను అమ్ముకుంటూ పోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ భూములు అమ్మకం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

'వలస కూలీలు దేశానికి సంపద.. వారిపై లాఠీ ఛార్జ్ చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.