అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నరసరావుపేట భాజాపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకర్ణ ఆమర సైదారావు అన్నారు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో స్థానిక భాజాపా సభ్యులు నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్కు వినతిపత్రం అందజేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేశామని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి కృష్ణమోహన్ అన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అగ్రవర్ణ పేదలకు తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పిస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చి అగ్రవర్ణ పేదల పొట్టగొడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: