ETV Bharat / state

'తెలుగు భాషను నాశనం చేసేందుకే ప్రభుత్వ కుట్ర' - guntur district bjp news

తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో భాజపా నేతలు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలు వేశారు. తెలుగు భాష అభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని కొనియాడారు. తెలుగు భాషను నాశనం చేసేందుకే వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నిందని నేతలు ఆరోపించారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భాజపా ఆధ్వర్యంలో తెలుగు భాష వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు.

BJP leader Srinivasa Reddy
భాజపా నేత శ్రీనివాస రెడ్డి
author img

By

Published : Aug 29, 2021, 1:58 PM IST

ఆంగ్లేయుల పాలనలో తెలుగుకు ఇచ్చిన గౌరవం కూడా జగన్ రెడ్డి పాలనలో దక్కడం లేదని భాజపా మహిళ మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామిని శర్మ విమర్శించారు. తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలు వేశారు. తెలుగు భాషను నాశనం చేసేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నిందని నేతలు ఆరోపించారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భాజపా ఆధ్వర్యంలో తెలుగు భాష వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని కొనియాడారు.

అంతకు ముందు అధికారుల తీరును నేతలు విమర్శించారు. తెలుగు భాషపై అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. కలెక్టరేట్ వద్దే తెలుగు తల్లి విగ్రహం ఉన్నా ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయించలేని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. నేతలే స్వయంగా తెలుగు తల్లి విగ్రహం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి నివాళులర్పించారు.

ఇదీ చదవండి

Chandrababu: 'తెలుగు, సంస్కృతానికి తేడా తెలియని పాలన ఇది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.