BJP KANNA LATEST NEWS : బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఓ ఇంటర్వ్యూలో పార్టీ అధిష్ఠానం వైఖరిపై కన్నా అసంతృప్తిని వెళ్లగక్కారు. జనసేనాని పవన్ కల్యాణ్‌తో సమన్వయం చేసుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందంటూ స్పష్టం చేశారు. మాజీ మంత్రి కన్నా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. పలువురు కన్నా అనుచరులు ఆయన నివాసానికి వచ్చి కన్నాతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో కన్నా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రానున్న రెండ్రోజుల్లో కన్నా రాజకీయ భవిష్యత్తుపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: