ETV Bharat / state

ప్రధాని మోదీ ఏడేళ్ల పాలన: గుంటూరులో 'సేవా హి సంఘటన్'

ప్రధానిగా మోదీ ఏడేళ్లు పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా.. గుంటూరులో సేవా హి సంఘటన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుతో కలిసి భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ మాస్కులు పంపిణీ చేశారు. ఏడేళ్లలో ప్రధానిగా మోదీ 135 సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు.

Seva Hi Sanghatan
మాస్కులు పంపిణీ చేసిన కన్నా లక్ష్మీ నారాయణ
author img

By

Published : May 30, 2021, 3:31 PM IST

ప్రధాని మోదీ ఏడేళ్ల పాలనలో దేశంపై చెరగని ముద్ర వేశారని భాజపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్... సబ్ కా విశ్వాస్ లక్ష్యంగా మోదీ సేవలు.. అందరి మన్ననలు పొందాయని తెలిపారు. ప్రధానిగా మోదీ ఏడేళ్లు పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా.. గుంటూరులో సేవా హి సంఘటన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి రావెల కిశోర్ బాబుతో కలిసి మాస్కులు పంపిణీ చేశారు.

రామ జన్మభూమి వివాదం, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ వంటి శతాబ్దాలుగా నలుగుతున్న దీర్ఘకాలిక సమస్యలకు మోదీ పరిష్కారం చూపారని గుర్తు చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లోనూ దేశం ముందడుగు వేసిందన్న ఆయన కరోనా కష్టకాలంలోనూ మోదీ ప్రజలకు అండగా నిలిచారని ప్రశంసించారు.

ఇవీ చూడండి..

రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు కాయకల్ప అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.