రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని వెంటనే అమలు చెయ్యాలని సీఐటీయూ, భవన నిర్మాణ కార్మికుల సంగం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలకు పైగా ఇసుక కొరత వలన నిర్మాణాలు నిలిచిపోయాయని.. కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఇటీవల ఇసుక విధానం ప్రకటించిన ప్రభుత్వం అమలుకు రెండు నెలల సమయం పొడిగించటం దారుణమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షల మంది భవన నిర్మాణ రంగం కార్మికులు పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు అన్నారు. మత్యకార్మికులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి మాదిరిగా... భవన నిర్మాణ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:విశాఖ జిల్లాలో టూరిస్ట్ బస్సు బోల్తా... ముగ్గురు మృతి