గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఆరు పెద్ద ద్విచక్ర వాహనాలు ఒక మోపెడు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరం శ్రీనగర్ కాలనీకి చెందిన సర్వేపల్లి అంకమ్మరావు కొంత కాలంగా చిలకలూరిపేట పట్టణం పాటిమీద నివాసం ఉంటున్నాడు. అందరితో కలివిడిగా ఉంటూ ద్విచక్ర వాహనాలు చోరీ చేసి వెంటనే నెంబర్ ప్లేట్లు మారుస్తూ వాటిని ఇతర ప్రాంతాలలో తక్కువ ధరకు విక్రయించే వాడు. ఇతనిని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిఘా ఉంచిన అర్బన్ సీఐ సూర్యనారాయణ బుధవారం పట్టణంలోని చీరాల రహదారిలో దొంగలించిన వాహనంతో ఉన్న అంకమ్మరావును ఎస్సైలు షఫీ, రాంబాబు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఆరు పెద్ద ద్విచక్ర వాహనాలు ఒక మోపెడ్ స్వాధీనం చేసుకున్నారు.
ఇది చదవండి కరోనా ఉందని తెలియక ఆపరేషన్.. క్వారంటైన్‌కు వైద్యులు!