కొవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా గుంటూరులో చిక్కుకుపోయిన సుమారు 1400 మంది బిహార్ వలస కార్మికులు స్వస్థలాలకు పయనమయ్యారు. ప్రభుత్వం ప్రత్యేక రైలులో తరలించింది. లాక్‌డౌన్ వలన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని.. సొంత ఊళ్లకు వెళ్తామని వారు అభ్యర్థించిన నేపథ్యంలో అధికారులు స్పందించారు.
వారికి రైలు ఏర్పాటుచేసి భోజన సదుపాయం కల్పించి పంపించారు. ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమకు ఇన్ని రోజులు ఆహారం అందించిన దాతలతో పాటు.. స్వస్థలాలకు పంపిస్తున్న అధికారులకు వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: