గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో మంగళవారం కిసాన్ మేళా జరిగింది. మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన రైతు కళ్ళం శ్రీనివాస్‌రెడ్డి... తాను పండించిన భారీ చిలకడ దుంపను ప్రదర్శనలో ఉంచారు.
సాధారణంగా చిలకడదుంప 100 గ్రాముల నుంచి అర కిలో వరకు బరువు ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో పండించిన ఈ దుంప మాత్రం.. 5 కిలోల వంద గ్రాముల బరువు పెరిగిందని, దీనిని పరిశీలించిన కేవీకే శాస్త్రవేత్త గంగాదేవి తెలిపారు.
ఇదీ చూడండి:
'మీరు మమ్మల్ని బెదిరించినా సరే.. మాకు నచ్చిన వారికే ఓటేస్తాం'