రాష్ట్రంలో అమలు చేయాలనుకుంటున్న కొత్త పారిశ్రామిక విధానానికి సంబంధించి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీబీ) ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇందులోని అంశాలను మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, వనిత, జయరాములు, విశ్వరూప్, అనిల్ కుమార్, బాలినేని శ్రీనివాస్, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా శుక్రవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్లో పరిశీలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో వీరంతా సమావేశమయ్యారు. కొత్త పారిశ్రామిక విధానంలో పరిశ్రమలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి