BC leaders Roundtable Meeting in Guntur: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రజల భాగస్వామ్యంతో రూపొందించనున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. విజయదశమి రోజున ముసాయిదా మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు అచ్చెన్న తెలిపాడు. మ్యానిఫెస్టోపై ప్రజల్లో విస్తృతచర్చ జరిగాక ఎన్నికల్లో అసలైన ఎన్నికల ప్రణాళికను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీమంత్రులు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్రతో కలిసి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
బీసీల కుల గణన జరగాలి: బీసీల సమగ్ర కుల గణన, వైసీపీ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం మాట్లాడారు. ఎన్టీఆర్ వచ్చాకే బీసీలకు ప్రాధాన్యం కల్పించారని అచ్చెన్నాయుడు చెప్పారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ 27 శాతం రిజ్వేషన్లు కల్పించినట్లు గుర్తు చేశారు. అనంతరం ఈ రిజర్వేషన్లను చంద్రబాబునాయుడు 34 శాతానికి పెంచారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. జగన్ కు విభజించడం, పాలించడం అలవాటైందని విమర్శించాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 54 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ.. ఇవి నామమాత్రంగా మిగిలాయని అచ్చెన్న ఆరోపించారు. బీసీల కుల గణన జరగాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
బలహీన వర్గాలకోసం టీడీపీ: త్వరలో జరగబోయే మహానాడులో చంద్రబాబు మ్యానిఫెస్టో ప్రకటిస్తారని వెల్లడించారు. ఈ మ్యానిఫెస్టోలో ప్రతిబక్కరిని కలుపుకొని పోతామని పేర్కొన్నాడు. గ్రామాల్లోని ప్రజాసమస్యలపై చర్చిస్తామని తెలిపారు. గతంలో (మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ) యంబీసీ పేరుతో రుణాలు ఇచ్చినట్లు అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఎన్టీఆర్ గతంలో రెషిడెన్షియల్ స్కూల్‌ను ప్రాంభిస్తే... చంద్రబాబు న్యాయకత్వంలో 175 రెషిడెన్షియల్ మంజురు చేసినట్లు గుర్తు చేశారు. బలహీన వర్గాలకోసం టీడీపీ ప్రభుత్వంలో ప్రతి జిల్లాకు బీసీ కమ్యూనిటీ హల్స్ నిర్మించేందుకు టెండర్లు పిలిచినట్లు గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పనులు ముందుకు నడవడం లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నాడు.
యనమల రామకృష్ణుడు: బీసీ జనగణన కోసం అంతా ఏకం కావాలని యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాన్ని నిజం చేయాల్సిన అవసరం ఉందని యనమల తెలిపారు. దాదాపు 144 కులాలు విడివిడిగా పోరాడితే ఏమీ సాధించలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బీసీలు కులాల వారిగా విడిపోవడం వల్ల 144 కులాలు, 144 సంఘాలు, వర్గాలుగా విడిపోయినట్లు తెలిపారు. భారత దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని కేంద్రం వెల్లడించాలని, అందుకోసం బీసీల గణన చేపట్టాలని యనమల డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల మాదిరిగానే చట్టసభల్లోనూ బీసీల ప్రాతినిధ్యం పెరగాలని యనమల ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: