రాష్ట్రంలో బీసీ కార్పోరేషన్ల ఏర్పాటు ద్వారా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలు వేశారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన బీసీ కార్పోరేషన్ ఛైర్మన్లు, డైరక్టర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి తెనాలి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెనాలి మార్కెట్ సెంటర్లో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు బీసీలను జెండా మోసేవాళ్లుగానే రాజకీయ పార్టీలు చూశాయని... రాజకీయంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఆ పార్టీ పునాదులు కదులుతున్నాయి కాబట్టే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో పాటు ఎమ్మెల్యే కైలె అనిల్ కుమార్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలను అన్ని విధాలుగా చంద్రబాబు అవమానించారని పార్థసారథి ఆరోపించారు. ఎన్టీఆర్ తరువాత బీసీల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి...