ETV Bharat / state

KOPPARU INCIDENT: కొప్పర్రు ఘటన..25 మంది అరెస్ట్​ - tdp ysrcp fight at kopparru

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో ఈ నెల 20 రాత్రి వినాయకుడి నిమజ్జన సమయంలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 25 మందిని అరెస్ట్ చేసినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అరెస్ట్ చేసిన రెండు వర్గాల వారిని పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో మీడియా ముందు హాజరుపరిచారు.

bapatla dsp srinivas clarifies on kopparu tdp, ysrcp fight incident

author img

By

Published : Sep 28, 2021, 2:40 PM IST

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు(Kopparru incident)లో జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బత్తిన శారదా ఇంటిపై దాడులకు సంబంధించి ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. 50 మంది తెదేపా, 21 మంది వైకాపా కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 14 మంది తెదేపా, 11 మంది వైకాపా కార్యకర్తలు అరెస్టు చేసినట్లు తెలిపారు. దాడిలో 8 మంది వైకాపా, ఐదుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు.

సెప్టెంబర్​ 20న నిమజ్జనోత్సవంలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. రెండువర్గాలకు చెందినవారు పరస్పరం దాడులు చేసుకున్నారని స్పష్టం చేశారు. ఘర్షణ సమయంలో స్థానిక ఎస్సై.. 8 మంది సిబ్బందితో ఘర్షణ ఆపే ప్రయత్నం చేసినా నిలువరించలేకపోయారని అన్నారు. అదనపు బలగాలతో అక్కడికి వెళ్లి రెండు వర్గాలను చెదరగొట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ATTACK : మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి... ఆరు ద్విచక్రవాహనాలు దగ్ధం

KOPPARRU INCIDENT: 50మంది తెదేపా, 19మంది వైకాపాకు చెందినవారిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.