లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన డప్పు కళాకారులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని గుంటూరు జిల్లా డప్పు కళాకారుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుంటూరు సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. 4 నెలలుగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కారణంగా దేవాలయం ఉత్సవాలు, వివాహాది శుభకార్యాలు లేకపోవడం వల్ల ఆదాయం కోల్పోయమన్నారు. కుటుంబాలు పోషించుకోవడం కష్టంగా మారిందని తమకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని వేడుకున్నారు. 40 సంవత్సరాల కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామని... రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారులను ఆదుకోవాలన్నారు.
ఇదీ చదవండి: