గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం హరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వామి పంచ మండపాల మహా పడిపూజ మహోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించారు. కేరళకు చెందిన గురుస్వామి నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి తొమ్మిది రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వేలాదిమంది అయ్యప్ప, భవాని, శివ మాల ధరించిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డప్పు శ్రీను భజన బృందం ఆధ్వర్యంలో పాడిన కీర్తనలకు... భక్తులు నృత్య ప్రదర్శన చేశారు.
ఇవీ చూడండి