బాపట్ల పట్టణం బాలకృష్ణపురం సమీపంలో రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఓ ఆటోడ్రైవర్ మృతి చెందాడు. మరణించిన వ్యక్తి నరసాయపాలెం గ్రామానికి చెందిన అంకమ్మరావుగా పోలీసులు గుర్తించారు. ఎదురుగా వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడం పట్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :