ETV Bharat / state

సీఎం నివాసం దగ్గర నుంచి అమరారెడ్డినగర్ వాసుల తరలింపు - guntur district latest news

సీఎం జగన్‌ నివాసానికి సమీపంలో అమరారెడ్డినగర్‌ వాసులను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. 200 మంది పోలీసులు, స్థానిక వాలంటీర్లు, అధికారులు దగ్గరుండి ఇళ్లు తొలగిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లబోమని బాధితులు స్పష్టం చేశారు.

Amarareddynagar
అమరారెడ్డినగర్ వాసులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న అధికారులు
author img

By

Published : Jul 20, 2021, 2:04 PM IST

Updated : Jul 20, 2021, 2:26 PM IST

అమరారెడ్డినగర్ వాసులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న అధికారులు

తాడేపల్లిలోని అమరారెడ్డి నగరవాసులను పోలీసులు, అధికారులు దగ్గరుండి ఖాళీ చేస్తున్నారు. సీఎం భద్రత నెపంతో అమరారెడ్డి నగర్​లోని కరకట్ట వద్ద సుమారు 283 మందిని ఖాళీ చేయాలని గతంలో నోటీసు ఇచ్చారు. తాము 30 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నామని.. న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేయడంతో వీరికి మంగళగిరి మండలం ఆత్మకూరు సమీపంలో స్థలాలు కేటాయించారు. ఇళ్లు కట్టుకునే వరకు అమరారెడ్డి నగర్​లోనే ఉంటామని నిర్వాసితులు అధికారులకు స్పష్టం చేశారు.

మరోవైపు రెండు రోజులుగా వీరిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఉదయం కరకట్ట ప్రాంతంలో దాదాపు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు పెట్టి ఎవరిని లోనికి రానీకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వాలంటీర్లు, నగర పాలక సంస్థ అధికారులు దగ్గరుండి ఇళ్లను తొలగిస్తున్నారు. పరిహారం విషయంలో కొంతమందికి అన్యాయం జరిగిందని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లమని బాధితులు తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి

JANASENA: నిరుద్యోగుల సమస్యలపై జనసేన పోరాటం.. నేతల గృహ నిర్భంధం

Last Updated : Jul 20, 2021, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.