Atchannaidu Fires on Jagan Mohan Reddy : తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు వెనకేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (jagan mohan reddy) అధికారంలోకి వచ్చాక మరో రూ.2 లక్షల కోట్లు ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తన అనుచరులు, సహ నిందితులకు లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్ము దోచి పెట్టిన విషయం ఒక్కొక్కటీ బట్టబయలవుతున్నాయని అచ్చెన్నాయుడు విమర్శించారు . కలుగులోంచి ఎలుకలు బయటకొచ్చినట్లు.. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కార్యక్రమాలు ఒక్కొక్కటీ నేడు కోర్టు ఆదేశాలతో బయటకొస్తున్నాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
Atchannaidu Comments about High Court Notices to 41 YCP Leaders : మైకు దొరికితే చాలు నీతులు వల్లించే జగన్మోహన్ రెడ్డి, విజయ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాసుదేవ రెడ్డి సహా 41 మందికి గురువారం హైకోర్టు నోటీసులిచ్చింది . ఈ నోటీసులుపై జగన్ సర్కార్ ఏం సమాధానం చెబుతుందని అచ్చెన్న నిలదీశారు . ప్రభుత్వ ప్రకటనలన్నీ ఏకపక్షంగా జగన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌కు కట్టబెట్టారని విమర్శించారు. ఇలా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. తీసుకున్న నిర్ణయాలన్నీ క్విడ్ ప్రోకో-2లో భాగమేనని హైకోర్టు నోటీసులతో బహిర్గతం అయిందని అచ్చెన్నాయుడు ఎద్దెవ చేశారు. శుభం పలికే బల్లి కుడితో పడి చచ్చినట్లు.. నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు వల్లించే జగన్ రెడ్డి, ఆయన ముఠా పరిస్థతి నేడు కోర్టు ఆదేశాలతో కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని అచ్చెన్నాయుడు విమర్శించారు . ఇప్పటికైనా జగన్ మోసాలకు
'ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టారు, ఆధారాలు మాయం చేశారు' - సీఎం జగన్, సజ్జల సహా 41మందికి నోటీసులు
Atchanna about Ysrcp Govt : జగన్‌కు ఆయన బంధు గణానికి వేల కోట్ల రూపాయిలు అనుచిత లబ్ధి చేకూరేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఎంపీ రఘరామ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై వైసీపీ నాయకులుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల సహా వివిధ శాఖల కార్యదర్శులకు, కంపెనీ డైరెక్టర్లకు మెుత్తం 41 మందికి హైకోర్టు గురువారం తాఖీదులు జారీ చేసింది.
నా ఎస్సీ, ఎస్టీలు అంటూనే వాళ్లపై జగన్ దాడులు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు