కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి... తమ కుమార్తెను తెనాలికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం చేశారు. కొద్దిరోజుల నుంచి కుమార్తె కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. సమాచారం అందుకున్న శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు కుమార్తె ఇంటికి వచ్చారు. తమ బిడ్డను ఇంటికి తీసుకెళతామని కోరగా... అత్తింటి వారు తిరస్కరించారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది.
ఆగ్రహంతో ఉన్న అల్లుడి తండ్రి వెంకటేశ్వరరావు... కొడవలితో శ్రీనివాసరావు, శ్రీలక్ష్మిపై దాడి చేసి పరారయ్యాడు. గమనించిన స్థానికులు వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరుకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై తెనాలి త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.