ఈనెల 31 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు గుంటూరు జిల్లాలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాపించకుండా విద్యార్థుల మధ్య కనీసం మీటరు దూరం ఉండేటట్టు చూడాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్విజిలేటర్లు, విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో 60వేలకు పైగా విద్యార్థులు హాజరవుతుండగా.. 209 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్న నెల్లూరు యువకుడు