AROs Appointed in Andhra Pradesh: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ రోజురోజుకు పుంజుకుంటోంది. రానున్న ఎన్నికలకు అధికారులు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎన్నికలకు అధికారుల నియామక ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నాలుగో జోన్లో ఏఆర్వోలను నియమిస్తూ భూ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సిఫార్సుల మేరకు రాయలసీమ ప్రాంతంలోని నాలుగో జోన్లో తహశీల్దార్లుగా, ఎన్నికల ఏఆర్వోలుగా నియమిస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కలెక్టరేట్లలో పనిచేస్తున్న అధికారులను తహసిల్దార్లుగా బదిలీ చేయటంతో పాటు వారిని 21 నియోజకవర్గాలకు ఏఆర్వోలుగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
MLA Rapaka ఎమ్మెల్యే రాపాక: నేను ఎన్నికల్లో గెలవడానికి దొంగ ఓట్లే కారణం.. రంగంలోకి దిగిన ఈసీ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జోన్లలోనూ వివిధ నియోజకవర్గాలకు ఏఅర్వోలను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఈమేరకు ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీలన్నీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకుని చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.
Jamili Elections జమిలి ఎన్నికలు - దేశంపై దీని ప్రభావం ఎలా ఉండనుంది?
జోన్-4లో పలువురు తహశీల్దార్ల బదిలీ వివరాలు : నాలుగో జోన్లో 21 మందిని బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కర్నూలు జిల్లాలోని పత్తికొండ, కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు, చిప్పగిరికి నూతన తహశీల్దార్‌లు నియమితులయ్యారు. అనంతపురం జిల్లాలో ఉరవకొండ, కల్యాణదుర్గం, యాడికి, రాప్తాడు, రామగిరికి తహశీల్దార్లును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సత్యసాయి జిల్లాలో మడకశిర, గుడిబండ, పుట్టపర్తి, నల్లమడ, ధర్మవరంతో పాటు వైఎస్సార్ జిల్లా చాపాడుకు ఒకరు బదిలీ అయ్యారు. అన్నమయ్య జిల్లాలో సుండుపల్లి, పుల్లంపేట, రామాపురం, కలకాడ, వాయల్పాడుకు కొత్త తహశీల్దార్లను నియమితులయ్యారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లకు తహశీల్దార్లు రిపోర్టు చేయాలని సీసీఎల్‌ఏ కార్యాలయం ఆదేశించింది.
"శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరగాలి - వారు ఎన్నికల పక్రియకు హాని"
బదిలీ అయిన తహశీల్దార్ల వీరే
జిల్లా | మండలం | అధికారి పేరు |
---|---|---|
కర్నూలు జిల్లా | పత్తికొండ | పద్మజ |
కోసిగి | పి. మురళి | |
కౌతాళం | అలెగ్జాండర్ | |
పెద్దకడబూరు | వి.సురేశ్‌బాబు | |
చిప్పగిరి | రామాంజులు నాయక్ | |
అనంతపురం జిల్లా | ఉరవకొండ | పద్మావతమ్మ |
కల్యాణదుర్గం | సుభాకర్రావు | |
రాప్తాడు | రామాంజనమ్మ | |
రామగిరి | వి. శ్రీనివాసులు | |
యాడికి | టి.జి. మోహన్‌వల్లీ | |
సత్యసాయి జిల్లా | మడకశిర | ఎ.వెంకటేశ్వర్లు |
గుడిబండ | ఈ.ప్రతాప్‌రెడ్డి | |
ధర్మవరం | డి.శ్రావణి | |
పుట్టపర్తి | భారతి | |
నల్లమడ | జి.నాగభూషణం | |
అన్నమయ్య జిల్లా | సుండుపల్లి | జి.పుణ్యవతి |
పుల్లంపేట | శ్రీనివాసులు | |
రామాపురం | ఆనంద్‌కుమార్ | |
కలకాడ | ఆర్.బాలాజీరాజు | |
వాయల్పాడు | కతీన్ జన్‌కుఫ్రా | |
వైఎస్సార్ జిల్లా | చాపాడు | భూషణం |