ఏపీఎస్ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బందిని... రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చాలని ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నూర్ మహమ్మద్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... గుంటూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు.
ఆర్టీసీలో పని చేస్తున్న తాము థర్డ్ పార్టీ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. తక్షణమే అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లాక్డౌన్ తర్వాత విధుల్లోకి తీసుకోకుండా ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
'ఆదాయం సృష్టించకపోగా.. ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి తీసుకొచ్చారు'