ETV Bharat / state

ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు వచ్చే పరిస్థితి లేదు: బొప్పరాజు - ఆంధ్రప్రదేశ్ వార్తలు

Bopparaju Venkateswarlu Comments: ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తాము ప్రభుత్వాన్ని ఎక్కువగా డబ్బులు అడగట్లేదని.. తమ డబ్బులనే తాము అడుగుతున్నామని అన్నారు. తమ బకాయిలు కూడా రావడం లేదని తెలిపారు. ప్రజలంతా తాము భవిష్యత్తులో చేయబోమే ఉద్యమానికి సహకరించాలని కోరారు.

Bopparaju Venkateswarlu
బొప్పరాజు వెంకటేశ్వర్లు
author img

By

Published : Feb 17, 2023, 7:26 PM IST

Bopparaju Venkateswarlu Comments: జీతాలు ఒకటో తేదీన ఇచ్చే పరిస్థితి లేకుండా ఉందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 30 శాతం పెంచాలని పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసినా రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం కూడా పెంచలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 50 శాతం మేర వేతనాలు పెంచారని బొప్పరాజు తెలిపారు.

ఉద్యోగులు వేరు కాదు.. ప్రభుత్వంలో భాగస్వామి అన్నప్పుడు ఆర్ధిక శాఖ తమకు లెక్కలు ఎందుకు చెప్పటం లేదని నిలదీశారు. ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. ఉద్యోగుల వేతనాలు సరైన సమయానికి ఖాతాల్లో జమ అవుతున్నాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఏ మొత్తాన్ని జమ చేస్తున్నారు.. ఏ మొత్తాన్ని వెనక్కు తీసుకుంటున్నారో అర్ధం కావటం లేదన్నారు.

వీఆర్ఏ లాంటి చిన్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వం డీఏను చెల్లించలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు.. తమ కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనివల్ల తమ పిల్లల పెళ్లిళ్లు కూడా వాయిదా పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఎంతగానో ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నారని అన్నారు. కానీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతోందని తెలిపారు.

వైద్యం కూడా చేయించుకోలేని స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. తాము ప్రభుత్వాన్ని ఎక్కువగా డబ్బులు అడగట్లేదని.. తమ డబ్బులనే తాము అడుగుతున్నామని అన్నారు. తమ బకాయిలు కూడా రావడం లేదని తెలిపారు. ప్రజలంతా తాము భవిష్యత్తులో చేయబోమే ఉద్యమానికి సహకరించాలని కోరారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు

"ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల.. ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో మాకైతే అర్థం కావడంలేదు. దాదాపు సంవత్సర కాలం నుంచి.. అంటే గత ఫిబ్రవరి 3వ తేదీన చలో విజయవాడ సందర్భంగా.. లక్షలాది మంది ఉద్యోగులు.. విజయవాడ పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. అప్పటికే ఉద్యోగుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉందనే విషయాన్ని ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేసినప్పటికీ.. ఆ రోజు నుంచి ఈ రోజుకి సంవత్సర కాలం అయినా కూడా ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు". - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.