ETV Bharat / state

ఏపీఈసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల - apecet results released

ఏపీఈసెట్‌ ప్రవేశపరీక్ష ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఏపీఈసెట్‌ ప్రవేశ పరీక్షకు 31,891 మంది హాజరుకాగా.. 30,654 మంది ఉత్తీర్ణత సాధించారు. అక్టోబర్‌ 8 నుంచి ఏపీఈసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌కు అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అక్టోబర్‌ 9న ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు.

apecet results
apecet results
author img

By

Published : Oct 6, 2020, 1:48 PM IST

ఏపీఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. సెప్టెంబరు 14న నిర్వహించిన ఈ పరీక్షకు 31,891 మంది హాజరుకాగా.. 30654 మంది ఉత్తీర్ణత సాధించారు. ర్యాంకు కార్డులను ఈ నెల8 నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. పురుషులలో 25,160 మంది, మహిళలు 6,731 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్ ఫలితాలను ఈ నెల 9న విడుదల చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సారి నిర్వహించిన పరీక్షలు ప్రత్యేకమైనవన్నారు. కేవలం రెండు వారాల్లోనే ఫలితాలు విడుదల చేశామన్నారు.

గ్రూపుల వారీగా మొదటి ర్యాంకు సాధించిన వారి వివరాలు..

  • అగ్రికల్చరల్ ఇంజనీరింగ్​లో అనంతపురానికి చెందిన గొర్తి వంశీకృష్ణ
  • బీఎస్సీ మేథమెటిక్స్ లో శ్రీకాకుళంకు చెందిన శివాల శ్రీనివాసరావు
  • సిరామిక్‌ టెక్నాలజీలో ప్రకాశం జిల్లాకు చెందిన తూతిక సంతోష్ కుమార్
  • కెమికల్‌ ఇంజనీరింగ్‌లో గుంటూరుకు చెందిన ముస్తాక్‌ అహ్మద్‌
  • సివిల్‌ ఇంజనీరింగ్​లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు అంజలి
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్​లో కాకినాడకు చెందిన కోడి తేజ
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్​లో కడపకు చెందిన నరేష్ రెడ్డి
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కుర్రా వైష్ణవి
  • ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్​లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన పృథ్వీ
  • మెకానికల్ ఇంజనీరింగ్​లో విశాఖ జిల్లా విద్యార్థి గరగా అజయ్
  • మెటలార్జికల్ ఇంజనీరింగ్​లో విజయనగరం జిల్లా విద్యార్థి వరుణ్ రాజు
  • మైనింగ్ ఇంజనీరింగ్ లో తెలంగాణలోని ములుగ చెందిన బానాల వంశీకృష్ణ
  • ఫార్మసీలో కృష్ణా జిల్లా విద్యార్థి అశ్లేష్ కుమార్, శ్రీకాకుళం జిల్లా విద్యార్థిని శాంతి

ఇదీ చదవండి: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఆర్థిక, తాజా అంశాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.