గుంటూరు విద్యానగర్ రాధాకృష్ణ అపార్ట్మెంట్లో నివాసం ఉండే సురేష్ భార్యకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి రాగా... తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. ఇంట్లో బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడిఉన్నాయి. బీరువాలో ఉన్న 10 లక్షల విలువైన ఆభరణాలు, లక్ష నగదు చోరీకీ గురైందని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
ఇది కూడా చదవండి