- చేతికొచ్చిన పంట వర్షార్పణం.. మాండౌస్ దెబ్బతో అల్లాడిపోయిన ఆంధ్రా రైతాంగం..
Cyclone Mandus caused damage to farmers: పండించిన పంట తుపాను దెబ్బకు వర్షార్పణం కావడంతో కర్షకులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీటమునిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసుంటే తమ కష్టం నీటిపాలు కాకుండా ఉండేదని వరి రైతులు వాపోతున్నారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు..
- విజయవాడలో భారాస రాష్ట్ర పార్టీ కార్యాలయం;ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఆదినారాయణ
Construction of Bharata Party office in Vijayawada: తెరాస నుంచి నూతనంగా అవతరించిన భారాస పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో నిర్మాణం చేపట్టనున్నారు.. ఈ మేరకు భారాస ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఆదినారాయణ తెలిపారు.
- 'తెలుగు సాహిత్యం, భాషకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి సిరివెన్నెల'
Sirivennela Seetarama Sastry Samagra Sahitya Book: సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య రెండు, మూడో సంపుటాలను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు హాజరై.. సీతారామ శాస్త్రితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
- ప్రేయసి కోసం వెళ్లి బావిలో దూకిన ప్రియుడు చివరకు జాక్‌పాట్
ప్రేయసిని కలిసేందుకు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి యువతి కుటుంబ సభ్యులకు అడ్డంగా బుక్కయ్యాడు. బిహార్‌లోని ఛప్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది. గడ్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీరాజ్పుర్లో ఉండే మున్నా రాజ్ అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి తన గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. రాత్రివేళ శబ్దాలు రావడాన్ని గమనించిన యువతి కుటుంబ సభ్యులు లేచి చూశారు. ఇంట్లోకి వచ్చిన మున్నా రాజ్‌ను తరిమేందుకు ప్రయత్నించారు. దీంతో తనను తాను కాపాడుకునేందుకు దగ్గర్లోని బావిలోకి దూకేశాడు మున్నా.
- నిద్రలోనే భార్యాభర్తల దారుణ హత్య.. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో..
ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతోనే వీరిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
- అమ్మాయిలు అదుర్స్.. ఆస్ట్రేలియాపై 'సూపర్' విక్టరీ.. అదరగొట్టిన స్మృతి, రిచా
భారత అమ్మాయిల జట్టు అదరగొట్టింది. ఆదివారం నాటకీయ మలుపులు తిరుగుతూ.. ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాను సూపర్ ఓవర్లో ఓడించింది. మహిళల క్రికెట్లో ఓ సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్.. వెస్టిండీస్ (18)ను వెనక్కినెట్టి రికార్డు సృష్టించింది.
- ఈ వారం 3 ఐపీఓల సందడి.. ఆ కంపెనీలో ఒక్కో షేరుకు 9 బోనస్ షేర్లు
స్టాక్ మార్కెట్లో ఈ వారం మూడు ఐపీఓలు సందడి చేయనున్నాయి. రూ.1858 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి ఐపీఓకు వస్తున్నాయి. అవేంటంటే?
- ఆ దేశంలో అందరి వయసూ రెండేళ్లు తగ్గుతుందట... అదెలాగంటే?
దక్షిణ కొరియన్ల వయసు ఒకట్రెండేళ్లు తగ్గనుంది. వయసు తగ్గడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ!! ఆ దేశం తీసుకురానున్న చట్టం ప్రకారం జనాభా మొత్తం వయసు ఒకటి, రెండేళ్లు తగ్గిపోనుంది. అదెలా అంటే?
- 'సుగుణ సుందరి'తో బాలయ్య సందడి.. రవితేజ ట్రైలర్ 'ధమాకా'!
బాలయ్య హీరోగా నటిస్తున్న 'వీరసింహారెడ్డి' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈనెల 15న ఈ సినిమాలోని "సుగుణ సుందరి" అనే పాట విడుదల చేయనున్నారు. మరోవైపు రవితేజ కథానాయకుడిగా నటించిన 'ధమాకా' సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈనెల 15న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించారు.