ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - AP LATEST NEWS

.

AP TOP NEWS
AP TOP NEWS
author img

By

Published : Nov 14, 2022, 2:59 PM IST

  • విషమంగా సూపర్​స్టార్​ కృష్ణ ఆరోగ్యం​.. హెల్త్​ బులిటెన్​ విడుదల చేసిన డాక్టర్లు
    సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్​ బులిటెన్​ విడుదల చేశారు వైద్యులు. ఆరోగ్యం విషమంగానే ఉందని కాంటినెంటల్‌ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ మేరకు వైద్యులు ప్రెస్​ మీట్ చెప్పి ఈ వివరాలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎమ్మెల్యే సుధాకర్​బాబుకు నిరసన సెగ.. స్వల్ప ఉద్రిక్తత
    వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నేతలు, పార్టీ నాయకులకు ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ప్రజల నుంచి నిరసనలు అందరూ ఊహించినవే కానీ ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఊహించని విధంగా సొంతవర్గం నుంచే నిరసన సెగ తగిలింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు?? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నెల్లూరు జిల్లాలో 4వ రోజు భారీ వర్షం..
    నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురస్తున్నాయి. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీటి ప్రవాహంలో ప్రైవేటు బస్సు నిలిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. నెల్లూరు, కావలి శివారు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. బోగోలు మండలం జక్కపల్లి గూడూరు చెరువు కలుజు నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కావలి శివారు ప్రాంతాల్లో పలు కాలనీల్లోని ఇళ్లలో వరద నీరు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేశ్‌
    జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల పట్ల ప్రభుత్వాలు మరింత బాధ్యతతో ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. డ్రైవర్​కి దేహశుద్ధి..
    ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. అయితే బస్సును నమ్మి ఎవరూ ప్రయాణం చేయరు. డ్రైవర్​ను నమ్మి ముందుకు సాగుతారు.. కానీ ఆ డ్రైవరే మహిళ పట్ల.. అసభ్యంగా ప్రవర్తిస్తే.. మనోళ్లు ఊరుకుంటారా మరి.. దేహశుద్ధి చేస్తారు కదా.. అదెక్కడో చూద్దామా! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యువతి దారుణ హత్య.. 35 ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో వేసిన బాయ్​ఫ్రెండ్​
    దిల్లీలో దారుణం జరిగింది. నమ్మి వచ్చి సహజీవనం చేస్తున్న యువతిని ఓ వ్యక్తి అతికిరాతకంగా గొంతుకోసి హత్యచేశాడు. ఆపై శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. 18 రోజుల పాటు రాత్రివేళ నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేశాడు. యువతి తండ్రి ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ముక్కు లేని వింత శిశువు జననం.. దేవుడు, గ్రహాంతరవాసి అంటూ పుకార్లు
    బిహార్​లో ముక్కు లేని ఓ వింత శిశువు జన్మించింది. ఈ శిశువును చూసేందుకు జనాలు తరలివస్తున్నారు. ఆ శిశువును చూసి కొంత మంది వినాయక స్వామి అంటుండగా.. మరికొంతమంది గ్రహాంతరవాసి అంటున్నారు. ఆ వింత శిశువు గురించి తెలుసుకుందామా.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 800 కోట్లకు ప్రపంచ జనాభా.. పుడమికి మరిన్ని కష్టాలు!
    నవంబర్​ 15 నాటికి ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకోనుంది. ఈ భూమి మీద ఉండే జనాభా మంగళవారానికి 800 కోట్లు దాటనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తుంది. అయితే.. ప్రపంచ జనాభా రానురాను పెరుగుతుంటే మున్ముందు ప్రస్తుతం ఉన్నంత సౌకర్యవంతంగా జీవించగలుగుతామా అన్నది ప్రశ్నలా మారనుంది! మరో వైపు ఈ భారం ప్రకృతి వనరులపై పడి ఎన్ని విపత్తులకు దారి తీస్తుందో అన్న భయం లేకపోలేదు! పుడమికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా!
    దేశంలో బంగారం, వెండిలు ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అది కోహ్లీ, సూర్య రేంజ్​.. అత్యంత విలువైన జాబితాలో చోటు!
    టీమ్​ఇండియా స్టార్ ప్లేయర్స్​ విరాట్​, సూర్య మరో అరుదైన ఘనత సాధించారు. పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2022లో ఐసీసీ ప్రకటించిన అత్యంత విలువైన ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. తాజా టోర్నీలో 98.66 సగటుతో 296 పరుగులు చేసిన కింగ్‌ కోహ్లీ ఈ జాబితాలో ముందు వరసలో నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.