ETV Bharat / state

ఎస్సై ప్రిలిమ్స్‌-హాల్‌టిక్కెట్​ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారా..? - ఏపీ పోలీస్ రాతపరీక్ష

AP Police SI hall ticket 2023: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్‌ వచ్చింది. ఈ పరీక్షకు హాల్‌ టిక్కెట్లను ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 05 నుంచి ఫిబ్రవరి 15 సాయంత్రం 5గంటల వరకు తమ అధికారిక వెబ్‌సైట్‌ లింకు https://slprb.ap.gov.in/UI/index నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.

AP Police SI hall ticket
AP Police SI hall ticket
author img

By

Published : Feb 6, 2023, 5:36 PM IST

SI hall ticket 2023 released: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్‌ వచ్చింది. ఈ పరీక్షకు హాల్‌ టిక్కెట్లను ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 05 నుంచి ఫిబ్రవరి 15 సాయంత్రం 5గంటల వరకు తమ అధికారిక వెబ్‌సైట్‌ లింకు https://slprb.ap.gov.in/UI/index నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. మరోవైపు, ఈ పరీక్ష ఫిబ్రవరి 19న జరగనుండగా.. తొలి పేపర్‌ ఉదయం 10 గంటల నుంచి 1గంట వరకు, రెండో పేపర్‌ మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన ఇవ్వగా.. మొత్తం 1,73,047 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 421 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 1,40,453 మంది పురుషులు దరఖాస్తు చేయగా.. 32,594 మంది మహిళలు ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.