![ap police issued notices to capital farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5575538_not.png)
రాజధాని గ్రామాలైన వెలగపూడి, మల్కాపురంలో పోలీసుల నోటీసులు కలకలం రేపాయి. పోలీసులు బృందాలుగా ఏర్పడి తమకు బలవంతంగా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారని రైతులు ఆరోపించారు. పలువురికి నోటీసులు జారీ చేసినట్లు రైతులు చెప్పారు. కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్కు రావాలంటూ నోటీసుల్లో చెప్పారని భయాందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15మందికిపైగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:ఈనెల 6న హైపవర్ కమిటీ తొలి భేటీ