పెట్రో ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు కాకపోయినా కనీసం ఆయిల్ కంపెనీలైనా చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్ పెట్రో డీలర్ల సమాఖ్య అధ్యక్షులు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో వాహనదారులపై భారంపడటమే కాకుండా నిత్యవసరాల రేట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. పెట్రో ధరలు ఇంతలా పెరిగినా డీలర్లకు వచ్చే కమిషన్ మాత్రం మారలేదని.. కానీ వినియోగదారుల నుంచి తాము విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోందని తెలిపారు.
'ఆయిల్ కంపెనీలు చమురు ధరలు తగ్గించాలి'
చమురు సంస్థలు పెట్రో ధరలను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ పెట్రో డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. చమురు ధరలను పెంచడం వల్ల నిత్యావసరాల రేట్లు పెరిగే అవకాశనముందన్నారు.
'ఆయిల్ కంపెనీలు చమురు ధరలు తగ్గించాలి '