ETV Bharat / state

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మల్యబాగ్చి ప్రమాణ స్వీకారం - హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మల్యబాగ్చి ప్రమాణ స్వీకారం వార్తలు

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మల్యబాగ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 6న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

high court new judge swearing
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మల్యబాగ్చి ప్రమాణ స్వీకారం
author img

By

Published : Jan 4, 2021, 11:41 AM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మల్యబాగ్చి ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి.. జస్టిస్ బగ్చితో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

జస్టిస్ బాగ్చి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి... బదిలీపై ఏపీ హైకోర్టుకు వచ్చారు. ఏపీ హైకోర్టు జడ్జిల సీనియారిటీలో జస్టిస్ బాగ్చి రెండో స్థానంలో కొనసాగుతారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు సీజేగా బదిలీపై వెళుతున్న సందర్భంగా... ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు హైకోర్టు న్యాయమూర్తులు వీడ్కోలు పలకనున్నారు. ఏపీ హైకోర్టులు ప్రధాన న్యాయమూర్తిగా అరూప్ కుమార్ గోస్వామి ఈనెల 6న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇదీ చదవండి: అనంతపురం పోలీసులకు షాక్ ఇచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.