గుంటూరు, ప్రకాశం జిల్లాలోని ఆయకట్టు స్థిరీకరణ, సాగు, తాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. కంపెనీల చట్టం 2013 ప్రకారం ఆంధ్రప్రదేశ్ పలనాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు కార్పొషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక సంస్థలతో పాటు బహిరంగ మార్కెట్‌లో రుణాలను ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సమీకరించి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2 జిల్లాల్లోని 9 లక్షల 61 వేల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా 73,136 ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చేలా ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు జల వనరుల శాఖ వెల్లడించింది.
మొత్తం నాలుగేళ్ల కాలానికి పలనాడులోని ప్రాజెక్టుల అభివృద్ధికి 5,343 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. వేదాద్రి ఎత్తిపోతలు సహా గుంటూరు ఛానల్ పరిధి పెంపు అంశాన్ని కూడా పలనాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ కిందకు తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి